Sunday, September 29, 2024
Homeసినిమాచిరు మూవీలో ర‌వితేజ‌తో పాటు మ‌రో క్రేజీ హీరో?

చిరు మూవీలో ర‌వితేజ‌తో పాటు మ‌రో క్రేజీ హీరో?

Third one also: మెగాస్టార్ చిరంజీవితో యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

బాబీ చిరు వీరాభిమాని కావ‌డంతో ఈ సినిమా పై మెగా అభిమానుల్లో మ‌రెంత ఆస‌క్తి పెరిగింది.అయితే.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మ‌హారాజా రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇంత‌కీ ఎవ‌రంటారా..? తమిళ హీరో విజయ్ సేతుపతి. అవును.. ఈ సినిమాలో విజయ్ సేతుప‌తి న‌టించ‌నున్నారు. పాత్ర ఏంటంటే.. ఈ సినిమాలో విలన్ గా నటించ బోతున్నాడని తెలిసింది.

విజయ్ సేతుపతి గతంలో సైరా సినిమాలో చిరంజీవి అనుచరుడిగా నటించాడు. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో విజయ సేతుపతి పాత్ర రివీల్ అవుతుందట. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ వార్త పై ఇంత వరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. చిరంజీవి ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రాల్లో ఈ మూవీకి భారీగా క్రేజ్ ఉంది. మ‌రి.. బాబీ చిరంజీవికి ఏ స్థాయి విజ‌యాన్ని అందిస్తాడో చూడాలి.

Also Read :  చిరంజీవి గాడ్ ఫాద‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్