Saturday, January 18, 2025
Homeసినిమావిజయ్ సేతుపతి విశ్వరూపమే 'మహారాజ' 

విజయ్ సేతుపతి విశ్వరూపమే ‘మహారాజ’ 

విజయ్ సేతుపతి విలక్షణమైన నటుడు. ఆయన ఒక పాత్ర చేయడానికి అంగీకరించాడంటే, ఆ పాత్రలో విషయం ఉంటుందనేది ఆడియన్స్ నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆయన ‘మహారాజ’ సినిమాతో మరోసారి నిలబెట్టాడు. ఈ సినిమా జూన్ లో థియేటర్లకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకి మంచి వసూళ్లు రావడం విశేషం. విజయ్ సేతుపతి మినహా ఈ సినిమాలో స్టార్స్ ఎవరూ కనిపించరు.

విజయ్ సేతుపతికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. సాధారణంగా మాస్ ఆడియన్స్ కి ఒక సినిమా నచ్చాలంటే, అందులో మంచి మాస్ మసాలా పాటలు .. వీలైతే ఓ ఐటమ్ సాంగ్ .. ఫైట్లు ఉండాలి. కానీ అలాంటి అంశాలేవీ లేని సినిమాగా ‘మహారాజ’ వచ్చింది. చాలా తేలికగా 100 కోట్లకి పైగా కొల్లగొట్టింది. ఈ ఏడాది తమిళనాట భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

ఒక సాధారణమైన వ్యక్తి తనకి ఎదురైన పరిస్థితుల వలన ఎలా మారిపోతాడు. ఒక చిన్న అపార్థం వలన జీవితాలు ఎలా బలైపోతాయి. ఒక చిన్న తొందరపాటు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పును ఎలా చేయిస్తుందనేది ఈ కథలో మనకి కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. క్లైమాక్స్ అనేది అప్పటివరకూ చూస్తూ వచ్చిన కథను మరింత బలోపేతం చేస్తుంది. కదిలించేది కథ అయితే ఆ కథ ఈ సినిమాలో ఉంది. కన్నీళ్లు పెట్టించేది కథ అయితే ఆ కథ ఈ సినిమాలో ఉంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటనను కాదు, ఆయన నట విశ్వరూపాన్ని చూడొచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్