Saturday, January 18, 2025
Homeసినిమాచరణ్ - బుచ్చిబాబు సినిమాపై స్పందించిన విజయ్ సేతుపతి!

చరణ్ – బుచ్చిబాబు సినిమాపై స్పందించిన విజయ్ సేతుపతి!

విజయ్ సేతుపతి ఇప్పుడే కాదు .. చాలా కాలం నుంచి బిజీ. ఎందుకంటే హీరో వేషాలు మాత్రమే చేస్తాను.. తమిళంలో మాత్రమే చేస్తాను అంటూ ఆయన ఎదురుచూస్తూ కూర్చోడు. తన దగ్గరికి వచ్చిన పాత్ర తనకి నచ్చితే చాలు, చేయడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడడు. ముఖ్యమైన పాత్రలు .. కీలకమైన పాత్రలు .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు చేయడానికి సైతం ఆయన ఆలోచన చేయడు. అలాంటి ఆయన తాజా చిత్రంగా ఇటీవల ‘మహారాజ’ వచ్చిన సంగతి తెలిసిందే.

విజయ్ సేతుపతి చేసిన ఈ సినిమా, తమిళంలో మాత్రమే కాదు తెలుగు వైపు నుంచి కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన బుచ్చిబాబు గురించి ప్రస్తావించాడు. ‘ఉప్పెన’ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి దర్శకుడు బుచ్చిబాబుతో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో రీసెంటుగా ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబును గురించి విజయ్ సేతుపతి  ప్రస్తావించాడు. బుచ్చిబాబు గొప్ప డైరెక్టర్. కథ చెప్పడంలో ఆయనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఆయన కథ చెప్పే తీరు వల్లనే నేను ‘ఉప్పెన’ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. త్వరలో చరణ్ తో ఆయన చేయనున్న కథ కూడా నాకు పూర్తిగా తెలుసు. తప్పకుండా ఆ సినిమా పెద్ద హిట్ కొడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు” అని అన్నాడు. దాంతో ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోవడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్