Saturday, January 18, 2025
Homeసినిమా100 కోట్ల దిశగా విజయ్ సేతుపతి 50వ సినిమా! 

100 కోట్ల దిశగా విజయ్ సేతుపతి 50వ సినిమా! 

విజయ్ సేతుపతికి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే, ఆ సినిమా కోసం అక్కడి అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా  ఎదురుచూస్తూ ఉంటారు. ఆయన ఒక సినిమా ఒప్పుకున్నాడంటే, ఆ సినిమాలో .. ఆయన పాత్రలో తప్పకుండా ఏదో కొత్త విషయం ఉండే ఉంటుందని అభిమానులు అనుకుంటారు. అంతగా ఆయన వాళ్ల  నమ్మకాన్ని సంపాదించుకున్నాడు,

ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘మహారాజ’ ఈ నెల 14వ తేదీన తమిళంలో విడుదలైంది. తెలుగులోను అదే టైటిల్ తో అదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మమతా మోహన్ దాస్ .. అనురాగ్న్ కశ్యప్ .. భారతీరాజా ముఖ్యమైన పాత్రలను పోషించారు. సుందరం – జగదీశ్ పళనిసామి నిర్మించిన ఈ సినిమాకి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. తమిళంలో విడుదలైన తొలి రోజునే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

కెరియర్ పరంగా ఈ సినిమా విజయ్ సేతుపతికి 50వ సినిమా. ఓపెనింగ్స్ రోజు నుంచే ఈ సినిమా దూసుకుపోతోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసింది. 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని అంటున్నారు. కథలోని ఎమోషన్స్ .. విజయ్ సేతుపతి నటన .. అజనీశ్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్