Sunday, January 19, 2025
Homeసినిమా'పుష్ప-2'లో విజ‌య్ సేతుప‌తి?

‘పుష్ప-2’లో విజ‌య్ సేతుప‌తి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన పుష్ప సౌత్ లోనే కాకుండా నార్త్ లో సైతం సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం విశేషం. దీంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోనూ పుష్ప 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఉండాల‌ని పుష్ప 2 క‌థ పై సుకుమార్ క‌స‌ర‌త్తు చేస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే.. పుష్ప లో పోలీసాఫీస‌ర్ క్యారెక్ట‌ర్ కి ఫ‌స్ట్ త‌మిళ్ స్టార్ విజ‌య్ సేతుప‌తిని అనుకున్నారు. అయితే.. విజ‌య్ సేతుప‌తి వేరే సినిమాల్లో బిజీగా ఉండ‌డంతో ఒప్పుకోలేదు. అప్పుడు మ‌లయాళ హీరో ఫహద్ ఫాజిల్ ని తీసుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 మొదలవుతోంది. మళ్ళీ విజయ్ సేతుపతి పేరు వినిపిస్తోంది. విజ‌య్ తో పుష్ప 2లో ఓ క్యారెక్ట‌ర్ చేయిస్తున్నార‌ని గ‌ట్టిగా వార్త‌లు వ‌చ్చాయి. విక్ర‌మ్ మూవీలో ఫాహిద్ ఫాజిల్, విజ‌య్ సేతుప‌తి న‌టించారు.

క‌మ‌ల్ కెరీర్ లోనే పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇది దృష్టిలో పెట్టుకునే పుష్ప 2లో కూడా విజ‌య్ సేతుప‌తిని తీసుకున్నార‌ని టాక్ వినిపించింది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై విజయ్ సేతుపతి టీం క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న జవాన్ చిత్రం మినహా ఇంకో పెద్ద సినిమా ఏది ఒప్పుకోలేదనేది ఆ టీమ్ చెప్పిన మాట. ‘పుష్ప 2’లో నటించడం లేదని  సేతుపతి వెల్లడించారు.

Also Read : ఐకాన్ స్టార్ స‌ర‌స‌న ఫిదా బ్యూటీ నిజ‌మేనా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్