ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పుష్ప‌ అఖండ విజయం సాధించడంతో పుష్ప 2 కోసం బ‌న్నీ అభిమానులు మాత్ర‌మే కాకుండా సినీ అభిమానులంద‌రూ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీలో ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌వి న‌టించ‌నుంద‌ని ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బ‌న్నీ, సాయిప‌ల్ల‌వి డ్యాన్స్ ఎలా చేస్తారో అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే వీరిద్ద‌రూ క‌లిసి సినిమాలో న‌టించాల‌ని.. ఓ పాట‌కు డ్యాన్స్ చేస్తే చూడాల‌ని అభిమానుల కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాంబినేష‌న్ సెట్  అయ్యింద‌ని.. పుష్ప 2 లో సాయిప‌ల్ల‌వి న‌టించ‌డం ఖాయ‌మ‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

ర‌ష్మిక పాత్ర చ‌నిపోతుంద‌ని టాక్. సాయిప‌ల్ల‌వి గిరిజ‌న యువ‌తి పాత్ర పోషిస్తుంద‌ని.. స్మ‌గ్లింగ్ కోసం ఓ తండాకు వెళ్లిన‌ప్పుడు పుష్ప రాజ్ కు సాయిప‌ల్ల‌వి హెల్ప్ చేయ‌డం వ‌ల‌న వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే.. ఇదంతా గ్యాసిప్ అని కొంద‌రు అంటుంటే.. కాదు నిజ‌మే అని మ‌రి కొంద‌రు అంటున్నారు. మ‌రి.. ఈ వార్త పై క్లారిటీ రావాలంటే మేక‌ర్స్ స్పందించాల్సిందే. ఇదే క‌నుక నిజ‌మైతే.. పుష్ప 2 కు మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *