Friday, May 31, 2024
Homeసినిమాఇండియా టుడే కవర్ పేజీ పై పుష్ప‌రాజ్.

ఇండియా టుడే కవర్ పేజీ పై పుష్ప‌రాజ్.

Magazine: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ప్రపంచ వ్యాప్తంగా 360 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 2021లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ మూవీ ఊహించని విధంగా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. బ‌న్నీని పాన్ ఇండియా స్టార్ ని చేసింది.

అల్లు అర్జున్ మేనరిజం.. తగ్గేదే లే అంటూ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. పుష్ప పార్ట్-1 వచ్చి ఏడు నెలల కావొస్తున్నా.. పుష్పరాజ్ మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిని బ‌ట్టి పుష్ప ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అల్లు అర్జున్.. ఇప్పుడు ఇండియా టుడే కవర్ పేజీ మీదకెక్కాడు. పాపులర్ మ్యాగజైన్ బన్నీ ముఖ చిత్రాన్ని ప్రచురిస్తూ.. ది సౌత్ స్వాగ్ అని పేర్కొంది. దక్షిణాది సినిమాలు.. అందులోని ప్రముఖ నటీనటుల క్రాస్ ఓవర్ సక్సెస్ వెనుక రహస్యం అని వివరించింది.

ఇందులో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా క‌నిపిస్తూ.. పుష్పరాజ్ మేనరిజమ్ తో తగ్గేదే అని పోజ్ ఇచ్చాడు. ఇండియా టుడే తన కవర్ పై బన్నీ ని ప్రచురించడం ద్వారా భారతీయ సినిమాలో దక్షిణాది ఆధిపత్యం గురించి.. కేవలం ఒక పాన్ ఇండియా చిత్రంతో బ‌న్నీ సృష్టించిన క్రాస్ ఓవర్ వాల్యూ గురించి చెబుతుంది. సౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ.. ఇప్పుడు నేష‌న‌ల్ లెవ‌ల్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మ‌రి.. పుష్ప 2 చిత్రంతో ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read : అల్లు అర్జున్ కు సన్మానం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్