Saturday, April 20, 2024
Homeసినిమాఅల్లు అర్జున్ కు సన్మానం

అల్లు అర్జున్ కు సన్మానం

Bunny felicitated: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ డైరెక్ష‌న్ లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా టాలీవుడ్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో సైతం సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో 100 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి చ‌రిత్ర సృష్టించింది. ఈ సంద‌ర్భంగా డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అల్లు అర్జున్ కు పార్క్ హయత్ హోటల్లో ఘన సన్మానం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బిరామిరెడ్డి , భానుప్రకాష్ ఐఏఎస్,  ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ పాల్గొన్నారు. ఈ వేడుక‌లో అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ అల్లు అర్జున్ ను గజమాలతో సత్కరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్