Saturday, July 27, 2024
Homeసినిమాసెప్టెంబర్ 9న విజ‌య్ సేతుప‌తి ‘లాభం’ విడుదల

సెప్టెంబర్ 9న విజ‌య్ సేతుప‌తి ‘లాభం’ విడుదల

విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది.  ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయ‌ర్ శ్రీరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకం పై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ… “ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై ఈ సినిమాను నా సొంత బ్యానర్ లో నిర్మించాను. కథ చాలా యూనిక్ గా ఉండి… ఓ మెసేజ్ ఇచ్చేలా సినిమాను తీశాం. రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర సమస్య… వ్యవసాయ భూముల పైనా… పంటల పైనా కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం… ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైనా చాలా కూలంకషంగా ఇందులో చూపించాము. ట్రైలర్ లో కూడా అదే చూపించాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు నా అభినందనలు” అన్నారు

నిర్మాతలు మాట్లాడుతూ “విజయ్ సేతుప‌తి, శ్రుతిహాస‌న్ జంట‌గా న‌టించిన ‘లాభం’ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను అన్ని కమ‌ర్షియ‌ల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులోశ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌ పై తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తుండ‌టం హ్యాపీగా ఉంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ‘ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్