Saturday, March 14, 2026
Homeసినిమావిజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు చిత్రం ప్రారంభం

విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు చిత్రం ప్రారంభం

Vijay-Vamshi: దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ చిత్రం రూపొందుతోంది. ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. చెన్నైలో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచే జరుగుతోంది. నేషనల్ క్రష్ రష్మికా మందన్న ఈచిత్రంలో విజయ్ సరసన కథానాయికగా నటిస్తుంది.

విజయ్ 66 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో భారీ తారాగణం కనువిందు చేయనుంది. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయనున్నారు. సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ మ్యూజిక్ అందించనున్నారు. వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లే  ను అందించారు. కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. భారీతారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం కలసి పనిచేస్తున్న ఈ చిత్రం దళపతి విజయ్ కెరీర్లో భారీ అంచనాలు వున్న సినిమాగా రూపుదిద్దుకుంటుంది.

Also Read : విజయ్ 66వ చిత్రంలో రష్మిక మందన్న 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular