Monday, January 20, 2025
HomeTrending Newsవిశాఖ సభ విజయవంతం చేయాలి : విజయసాయి

విశాఖ సభ విజయవంతం చేయాలి : విజయసాయి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు పాల్గొంటున్న బహిరంగసభను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు విశాఖ సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో ప్రధాని సభ ఏర్పాట్లపై  సమీక్ష నిర్వహించారు.  మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయడం అందరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.

అనంతరం నేతలతో కలిసి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ కు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు.  పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.  ఈ భేటీలో డిప్యూటీ సిఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస రావు, కన్నబాబు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్