Saturday, November 23, 2024
HomeTrending Newsవిజయసాయికి కీలక బాధ్యతలు

విజయసాయికి కీలక బాధ్యతలు

Key role: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డిని పార్టీ అన్ని అనుబంధ విభాగాలకు ఇన్ ఛార్జ్ గా జాతీయ అధ్యక్షుడు,  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ జగన్ సంతకంతో కూడిన ఓ ప్రకటనను ఆ పార్టీ కార్యాలయంనుంచి విడుదల చేశారు.

వైఎస్ జగన్ 2011 మార్చి 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటినుంచి విజయసాయి రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 2016లో జగన్ ఆయన్ను రాజ్య సభకు పార్టీ తరఫున ఎంపిక చేశారు. నాటి నుంచి ఎంపీగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై రాజ్యసభలో పోరాడుతూ వస్తున్నారు. విశాఖ పట్నం కేంద్రంగా అయన తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

2019లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అయన ఉత్తరాంధ్ర ప్రాంతానికే పరిమితమై పని చేస్తున్నారు.  పార్టీలో అయన ప్రాధాన్యం తగ్గిందని, జగన్ ఆయన్ను దూరం పెడుతున్నారనే వార్తలు విపక్షాలనుంచి, కొన్ని మీడియా సంస్థల నుంచి వచ్చాయి. ఇటీవల ఓ దశలో  అయితే ఆయనను తిరిగి రాజ్యసభకు పంపే విషయంలో కూడా సిఎం జగన్ పునరాలోచనలో పడ్డారని కూడా కథనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను తిరిగి పార్టీలో క్రియాశీలకంగా, అనుబంధ విభాగాలు అన్నింటికీ ఇన్ ఛార్జ్ గా నియమించడం విశేషం. విపక్షాలు, పలు మీడియా సంస్థలు చేస్తున్న విమర్శలకు నేటి నియామకంతో చెక్ పడినట్లయ్యింది.

Also Read : ఏపీపీఎస్సీ చైర్మన్  గా గౌతమ్ సావాంగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్