You only: వంచన అనే తల్లికి, వెన్నుపోటు అనే తండ్రికి పుట్టిన రాజకీయ నేత చంద్రబాబు అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. మహానాడులో సిఎం జగన్ ను ఉన్మాది అని చంద్రబాబు అనడంపై విజయసాయి తీవ్రంగా మండిపడ్డారు. బాబు ఇంటిపేరు నారా అని… నా అంటే నాసిరకం; రా అంటే రాజకీయం చేసేవాడు బాబు అని ఘాటుగా విమర్శించారు. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ కు 73 ఏళ్ళ వయసులో బాబు ఆయనకు వెన్నుపోటు పొడిచారని, బాబుకు ఇప్పుడు 72 ఏళ్ళని, వచ్చే ఏడాది బాబును అయన కుమారుడు లోకేష్ వెన్నుపోటు పొడుస్తారని విజయసాయి జోస్యం చెప్పారు. బాబు లోకేష్ ను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని, అందుకే ఆయన్ను గుర్తించడం లేదని అన్నారు.
బాధ్యతలేని ప్రతిపక్షనేతగా బాబు ఉన్నారని, అసలు అయన ఈ పదవికి కూడా అనర్హుడని, అందుకే ‘క్విట్ బాబు- సేవ్ ఏపీ’ అనే నినాదంతో వైసీపీ ముందుకు వెళుతోందని చెప్పారు. అది మహానాడు కాదని.. ఏడాదికోసారి ఎన్టీఆర్ కు పెడుతున్న తద్దినం అని అభివర్ణించారు. అది మహానాడు కాదని, అది ఒక మహా ప్రస్థానం, మహా స్మశానం అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రామారావు పెట్టిన పార్టీని లాక్కున్నారని, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవాలంతా కామారావులేనన్నారు.
చంద్రబాబు చెబితే ముందస్తు ఎన్నికలు వస్తాయా అని విజయసాయి ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిపాలన అద్భుతంగా సాగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సంతోషంగా ఉన్నారని విశ్వాసం వెలిబుచ్చారు.
Also Read : అది మహానాడు కాదు…: తమ్మినేని