Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: Weight Lifting: వికాస్ ఠాకూర్ కు రజతం

CWG-2022: Weight Lifting: వికాస్ ఠాకూర్ కు రజతం

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత వెయిట్ లిఫ్టింగ్ కు మరో రజతం లభించింది. పురుషుల 99 కిలోల  విభాగంలో మన దేశానికి చెందిన వికాస్ ఠాకూర్ రజత పతకం సంపాదించాడు. స్నాచ్ కేటగిరీలో 155 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 191 కిలోలు కలిపి మొత్తం 346 కిలోలతో రెండో స్థానంలో నిలిచాడు.

వికాస్ కు ఇది మూడో కామన్వెల్త్ మెడల్. 2014లో సిల్వర్, 2018లో బ్రాంజ్, ఈ 2022లో సిల్వర్ సాధించి మూడు వరుస గేమ్స్ లో పతకాలు సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు.

వికాస్ సాధించిన రజతంతో కలిపి ఇండియా ఇప్పటివరకూ మొత్తం 12 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఐదు స్వర్ణం, నాలుగు రజతం, మూడు కాంస్యం ఉన్నాయి.

Also Read : పురుషుల గ్రూప్స్ లో ఇండియాకు స్వర్ణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular