Friday, March 29, 2024
Homeసినిమాఫిబ్ర‌వ‌రి 24న  ‘విక్రాంత్ రోణ‌’ విడుద‌ల‌

ఫిబ్ర‌వ‌రి 24న  ‘విక్రాంత్ రోణ‌’ విడుద‌ల‌

3D movie in multiple languages:
క‌న్న‌డ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌ ’. పోస్ట‌ర్స్‌,  గ్లింప్స్‌ తో అంచ‌నాల‌ను పెంచిన  ఈ త్రీ డీ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ జాక్ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్ తెలియ‌జేశారు. కిచ్చా సుదీప్‌తోపాటు  నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. రిలీజ్ డేట్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో కిచ్చా సుదీప్.. ఫాంటమ్ అనే స్టైలిష్ బైక్‌తో క‌నిపిస్తున్నారు.

నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ “మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా 3 డీ టెక్నాలజీలో రూపొందించిన ‘విక్రాంత్ రోణ‌’ను ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేస్తున్నాం అని తెలియ‌చేయ‌డానికి సంతోషిస్తున్నాం. మ‌న ప్రేక్ష‌కులు చాలా గొప్ప‌వాళ్లు. డిఫ‌రెంట్ సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తారు. వారిపై న‌మ్మ‌కంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ‌ను రూపొందించాం” అన్నారు.

ద‌ర్శ‌కుడు అనూప్ భండారి మాట్లాడుతూ “థియేటర్స్ లో సినిమాను ఎంజాయ్ చేసే ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన అనుభూతిని అందించ‌డానికి విక్రాంత్ రోణ చిత్రాన్ని రూపొందించాం. త్రీ డీ టెక్నాల‌జీతో రూపొందించిన ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌లోనే ఎంజాయ్ చేయాలి. ఈ ప్ర‌పంచానికి స‌రికొత్త సూప‌ర్ హీరోను ప‌రిచ‌యం చేస్తున్నాం. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు విజువ‌ల్ ట్రీట్‌గా సినిమా అల‌రిస్తుంది. ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా కోసం ప్రేక్ష‌కుల‌తో పాటు మేం కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం” అన్నారు.

జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్‌ రోణా మల్టిలింగ్వుల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌ సినిమాను 14 భాషల్లో 55 దేశాల్లో విడుదల చేస్తున్నారు. బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. అవార్డ్ విన్నింగ్‌ ఆర్ట్ డైరక్టర్‌ మెస్మరైజ్‌ చేసే సెట్స్ వేశారు. విలియమ్‌ డేవిడ్‌ కెమెరా పనితనం విజువల్‌ ఫీస్ట్ గ్యారంటీ అనే ఫీలర్స్ ఇస్తోంది.

Also Read : సుదీప్ ‘విక్రాంత్ రోణ‌’ లో జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్