Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Ind Vs. WI: విరాట్ సెంచరీ - ఇండియా 438

Ind Vs. WI: విరాట్ సెంచరీ – ఇండియా 438

ట్రినిడాడ్ టెస్టులో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులు చేసింది. నిన్న తొలిరోజు 87 పరుగులతో క్రీజులో ఉన్న విరాట్ 121 స్కోరు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. జడేజా-61;  అశ్విన్-56 పరుగులతో రాణించారు. మిగిలిన వారిలో ఇషాన్ కిషన్-25; జయ్ దేవ్ ఉనాడ్కత్- 7 పరుగులు చేయగా, సిరాజ్ డకౌట్ అయ్యాడు.

విండీస్ బౌలర్లలో రోచ్, వార్రికన్ చెరో 3; హోల్డర్ 2; బాబ్రిఎల్ ఒక వికెట్ పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ (చందర్ పాల్ – 33) కోల్పోయి 87 పరుగులు చేసింది. బ్రాత్ వైట్-37; మెక్ కంజీ- 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్