రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని, ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశం. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడిన హైకోర్టు. కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఈ సందర్భంగా ఏజీ వెల్లడించారు. పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. హైకోర్టులో రేపట్నుంచి వర్చువల్‌గా కేసుల విచారణ జరుగుతుందని, ఆన్‌లైన్‌లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్నట్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 25 కు వాయిదా వేసిన హైకోర్టు.