7.2 C
New York
Monday, December 11, 2023

Buy now

HomeసినిమాVirupaksha Pre Release: ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమా 'విరూపాక్ష' - సాయిధరమ్ తేజ్

Virupaksha Pre Release: ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమా ‘విరూపాక్ష’ – సాయిధరమ్ తేజ్

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌ పై ఈ చిత్రం రూపొందింది. బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘అమ్మా ఐ లవ్యూ.. ఈ సినిమాను నీ కోసం, వైష్ణవ్ కోసం చేశాను అమ్మ. 2009లో నా సినిమా జర్నీ మొదలైంది. ఐదేళ్ల తరువాత నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. 2016 వరకి వెనక్కి చూసుకోవాల్సిన పని లేదు. ఆడియెన్స్ నన్ను యాక్సెప్ట్ చేసి, హిట్లు ఇచ్చారు. ఆ తరువాత వరుసగా ఆరు ఫ్లాపులు వచ్చాయి. నన్ను నేను రీ కరెక్ట్ చేసుకున్నాను. 2019 ఏప్రిల్ వరకు నేర్చుకుంటూనే ఉన్నాను. చిత్రలహరి సినిమాతో బయటకు వచ్చాను. ఆ సినిమాకు సుకుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. నా కమ్ బ్యాక్ సినిమాకు చీఫ్ గెస్టుగా వచ్చారు. ఇప్పుడు మళ్లీ నా సినిమాకు నిర్మాత అయ్యారు. ఆ సినిమా తరువాత కాస్త మంచి చిత్రాలే వచ్చాయి. 2019, 20 వచ్చింది. లాక్డౌన్ వచ్చింది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా వచ్చింది. అత్తారింటికి దారేది సినిమా షూటింగ్‌కు వెళ్తే ప్రసాద్ గారు నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు.

బాపీ అన్న కూడా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. 2021 సెప్టెంబర్ 10 నేను అనుకోకుండా బైక్ మీద జారి పడ్డాను. బైక్ నడపడం తప్పు అని నేను అనుకోను. నాకు బైక్ అంటే ప్రాణం. సెప్టెంబర్ 16, 17 డేట్ సరిగ్గా గుర్తు లేదు. లేవగానే అమ్మ, తమ్ముడు కనిపించాడు. కానీ ఏం మాట్లాడలేకపోయాను. సారీ, ఐ లవ్యూ కూడా చెప్పలేకపోయాను. కడుపులో బాధ వచ్చింది. ఏంటో అర్థం కాలేదు. డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వెళ్లాం. నిల్చోలేకపోతోన్నాను. మాట రావడం లేదు. కంట్లో ఏడుపు, గుండెల్లో గుబులు వచ్చింది. బాధ వల్ల.. నొప్పి కలగడం, జీవితాల్ని మార్చడం జరుగుతుంది. ఎలాగైనా సరే మాట్లాడాలని అనుకున్నాను. కష్టపడ్డ, బాధపడ్డ, మీ ప్రేమను పొందాను. ఎంత కష్టపడ్డా కూడా మీ ప్రేమను పొందుతూనే ఉంటాను. నేను ఈ కథ అంతా సింపతీ కోసం చెప్పలేదు. మిమ్మల్ని కూడా ఇన్‌స్పైర్ చేస్తుందని చెప్పాను. మీ అమ్మ, నాన్న, గురువులు గర్వపడేలా చేయాలి. మేలుకో, లేచి నిలబడు.. అమ్మానాన్నలు, గురువులు గర్వపడేలా చేయండి.

బైక్ నడుపుతూ ఉంటే.. అందరూ హెల్మెట్‌ను వాడండి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. మిమ్మల్ని అలరించాలని ఈ సినిమా చేశాం. తేజ్ నీ కోసం మంచి కథను పంపిస్తాను విను అని సుకుమార్ గారు అన్నారు. మంచి లవ్ స్టోరీ పంపిస్తారని అనుకున్నాను. కానీ భయపెట్టే కథను పంపించారు. అసలే హారర్ సినిమా అంటే నాకు భయం. అద్భుతంగా నెరెట్ చేశాడు కార్తిక్. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. మా నిర్మాతలు బాపీ అన్నా, ప్రసాద్ గారికి థాంక్స్. నాకు అండగా నిలబడ్డారు. ఎంతో సపోర్ట్ చేశారు. శ్యాం గారి లైటింగ్ అద్భుతంగా ఉంది. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారి సెట్‌లు చూస్తే ఆడియెన్స్ భయపడతారు. అజనీష్ గారి ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. మీ అందరి ప్రేమను పొందేందుకు సినిమాలతో వస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన ఆ గురువు, దేవుడికి థాంక్స్. ఆయన నాకు చాన్స్ ఇచ్చారు. 2009లోనే ఆయన నన్ను నమ్మారు. నా గురువుతో కలిసి సినిమా చేసే అవకాశం ఇచ్చిన సముద్రఖని గారికి థాంక్స్. కాలర్ ఎగిరిసేలా ఆ సినిమా ఉండబోతోంది. మా ముగ్గురు మామయ్య వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను’ని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్