Wednesday, March 18, 2026
HomeTrending Newsవిశాఖలో 'దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్’

విశాఖలో ‘దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్’

Make-in AP:
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ  అధ్వర్యంలో ‘దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్’ పేరిట ఒక రోజు వర్క్ షాప్ ను  సోమవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)తోపాటు  ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ప్రధానంగా ఈ వర్క్ షాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాటనుంది.

ఈ వర్క్ షాప్ లో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సహా పలు కీలక ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు అనేక దేశీయ, విదేశీ సంస్థలు పాల్గొననున్నాయి. హోటల్ రాడిసన్ బ్లూలో ఉదయం ఈ వర్క్ షాప్ ప్రారంభమై సాయంత్రం వరకూ కొనసాగనుంది.

Also Read : ‘ఆచార్య‌’ నుంచి ‘సిద్ధ’ టీజర్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular