AP CS to continue:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు పొడిగించింది. సిఎస్ పదవీ కాలాన్ని పెంచాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అభ్యర్ధనను అంగీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ (డిఓపిటి) ఓ ప్రకటనలో వెల్లడించింది. శాఖా అండర్ సెక్రటరీ కులదీప్ చౌదరి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
డా. సమీర్ శర్మ అక్టోబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు, 1985 వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన డా.శర్మ వాస్తవానికి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే అయన సిఎస్ పదవిలో పదవీలో కేవలం రెండు నెలలపాటు మాత్రమే ఉండడం, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సమీర్ శర్మకు మరో ఆరు నెలలపాటు పొడిగింపు ఇవ్వాలంటూ ఈ నెల 2న సిఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి కేంద్రం అంగీకరించింది. దీనితో 2021 డిసెంబరు 1వ తేదీ నుండి 2022 మే 31 వరకూ సమీర్ శర్మ పదవీ కాలం పొడిగించినట్లయింది.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.