Thursday, March 12, 2026
Homeసినిమాపునీత్ కి నిజమైన స్నేహితుడు అనిపించిన విశాల్

పునీత్ కి నిజమైన స్నేహితుడు అనిపించిన విశాల్

Vishal Came Forward To Continue Puneeth Service Activities In Education :

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. పునీత్ గుండెపోటుతో చనిపోవడంతో అందరినీ షాక్ కు గురి చేసింది. అభిమానులు శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే.. యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన సినిమా ఎనిమి. ఈ మూవీ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ మాట్లాడుతూ పునీత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

“పునీత్ మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. పునీత్ కేవలం మంచి నటులే కాదు.. గొప్ప మనిషి. ఒక మనిషి ఇన్ని సహాయ కార్యక్రమాలు చేయగలరా? అని అనిపించింది. ఓ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఆయన చేశారు. అయన 1800 మంది పిల్లలను చదివిస్తున్నారు. ఆయన స్నేహితుడిగా నేను ఆయనకు చేయగలిగింది ఇదే. ఆ 1800 మంది పిల్లల బాధ్యతను నేను తీసుకుంటాను. వచ్చే ఏడాది వారిని నేను నడిపిస్తాను. వారికి అండగా ఉంటాన‌ని హామీ ఇస్తున్నాను” అని ప్రకటించి విశాల్ పునీత్ కి నిజమైన స్నేహితుడు అనిపించుకున్నారు.

Must Read :పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular