ట్రైలర్‌ను గమనిస్తే “ఏం బాసూ రెడీయా.. వెల్ కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మార్క్ ఆంటోని” అంటూ స్టార్ట్ అయ్యింది. కొందరు విలన్స్ కత్తులు పట్టుకుని ఎవరినో చంపడానికి పరుగులు తీస్తుంటారు. మరో వైపు ఓ డబుల్ డెక్కర్ బస్ పైన కూడా కొందరు దాడి చేస్తారు. అప్పుడే ఆంటోని పాత్రను రివీల్ చేశారు. ఓ మహిళతో ఆంటోని “నేను విలన్.. విలన్‌గానే ఉంటాను” అంటూ కర్కశంగా చెబుతాడు. మరో వైపు “మంచిలో ఏంట్రా చెడు.. చెడులో ఏంట్రా” మంచి అనే విశాల్ కొందరిని ఉద్దేశించి డైలాగ్ చెప్పటం .. ఆంటోని చెడ్డవాడు అని చెబుతూ వచ్చే యాక్షన్ సీక్వెన్సులు ఆసక్తికరంగా ఉన్నాయి.
‘వరల్డ్ అఫ్ మార్క్ ఆంటోని’ లోకి ఆహ్వానిస్తున్న విశాల్
విలక్షణమైన సినిమాలు, విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు విశాల్ టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’. మినీ స్టూడియో బ్యానర్ పై అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా ‘మార్క్ ఆంటోని’ మూవీ సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు.
ఇక కీలక పాత్రధారి అయిన ఎస్.జె సూర్యతో విశాల్ మాట్లాడుతూ లేడీస్ మ్యాటర్ అని చెప్పగానే తను విలనిజం చూపిస్తూనే పండించిన కామెడీ ఆసక్తికరంగా ఉంది. సునీల్ పాత్ర మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. మన ప్లాన్ ప్రకారం ఆంటోనీని వేసేయాలంటూ సునీల్ చెప్పే డైలాగ్‌తో పాటు తను ముసలి పాత్రలో పంచె ఎగ్గట్టి గన్ తీసుకుని చేసే ఫైట్ చూస్తుంటే తన పాత్రేంత పవర్‌ఫుల్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడే అసలు సినిమాలో ట్విస్ట్ ఎలా ఉండబోతుందో ట్రైలర్లో టచ్ ఇచ్చారు. చిరంజీవి అనే సైంటిస్ట్ టైమ్ ట్రావెల్ ఫోన్‌ను కనిపెడతాడు. ఆ ఫోన్‌తో గతానికి వెళ్లి మాట్లాడవచ్చునని తెలుసుకున్న విశాల్ క్యారెక్టర్ తన తండ్రికి ఫోన్ చేస్తే ఎస్.జె.సూర్య ఫోన్ తీస్తాడు. ఆ సందర్భంలో విశాల్, ఎస్.జె.సూర్య మధ్య వచ్చే కామెడీ ఆకట్టుకుంటోంది. అసలు ఆ ఫోన్‌తో ఎవరెవరు మాట్లాడారు..? ఏం మాట్లాడారు..? ఫోన్లో టైమ్ ట్రావెల్‌ను ఎలా చేశారనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.