హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా న‌టించిన చిత్రం నిన్నే పెళ్లాడ‌తా. ‘పైసా’ మూవీ ఫేమ్ సిద్ధికా శర్మ హీరోయిన్ గా న‌టించింది.  వైకుంఠ బోను దర్శకత్వంలో  ఈశ్వరీ ఆర్ట్స్, అంబికా ఆర్ట్స్ బ్యానర్లపై  వెలుగోడు శ్రీధర్ బాబు, బొల్లినేని రాజశేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 14న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్  ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.

ముఖ్య అతిధిగా వచ్చిన హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా హీరో అమన్‌ చాలా జోవియల్ పర్సన్,. తను ఈ సినిమాలో ఫైట్స్, డ్యాన్స్, యాక్టింగ్ ఇలా అన్ని రకాలుగా చాలా బాగా చేశాడు..50 సంవత్సరాలనుండి సాయికుమార్ గారు నటించడమంటే గ్రేట్ హనర్, హీరో, హీరోయిన్ లకే కాకుండా.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి గుర్తింపు వస్తుంది… మంచి టైటిల్ తో వస్తున్న దర్శక,నిర్మాతలకు ఈ చిత్రం పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ద బెస్ట్’ అని అన్నారు.

హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఆమన్ నాకు మంచి మిత్రుడు. డైరెక్టర్ వైకుంఠ గారు సినిమా చాలా బాగా తీశారు. నవనీత్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమా నిర్మాతలకు గొప్ప విజయం సాదించాలి. టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

Also Read శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ‘నిన్నే పెళ్లాడతా’ టీజర్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *