Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్నార్వే చెస్: కార్ల్ సేన్ పై ఆనంద్ విజయం

నార్వే చెస్: కార్ల్ సేన్ పై ఆనంద్ విజయం

Anand Again: నార్వే చెస్ టోర్నమెంట్ క్లాసికల్ విభాగంలో భారత చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వరుసగా మూడు విజయాల అనంతరం  మొన్న నాలుగో రౌండ్ లో  ఓటమి ఎదుర్కొన్న  ఆనంద్ నేడు జరిగిన ఐదో రౌండ్ లో వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సేన్ ను ఓడించాడు. ఈ విజయం  తర్వాత 10పాయింట్లతో  టాప్ ప్లేస్ ను పదిలపరచుకున్నాడు.

తొలి గేమ్ లో ఫ్రాన్స్ ఆటగాడు మాక్సిమ్ లాగ్రావే పై; రెండో  రౌండ్ లో బల్గేరియా ఆటగాడు వేసెలిన్ తపలోవ్ పై, మూడో రౌండ్ లో చైనా ఆటగాడు వాంగ్ హువో పై విజయాలు సాధించిన ఆనంద్ నాలుగో మ్యాచ్ లో అమెరికా ఆటగాడు వెస్లీ సో చేతిలో ఓటమి పాలయ్యాడు. నేడు జరిగిన ఐదో రౌండ్ లో రెగ్యులర్ గేమ్ 40ఎత్తుల వద్ద డ్రా గా ముగిసింది. అయితే సడన్ డెత్ గేమ్ లో ఆనంద్ తన మేధస్సుకు పదును పెట్టి ప్రత్యర్థి కార్ల్ సేన్ ను 50 ఎత్తుల్లో ఓడించాడు.

క్లాసికల్ టోర్నీకి ముందు జరిగిన బ్లిట్జ్ ఈవెంట్ లో కూడా ఆనంద్ కార్ల్ సేన్ ను ఓడించిన విషయం గమనార్హం. కానీ ఆ ఈవెంట్ లో  అన్ని రౌండ్లూ పూర్తయ్యే నాటికి ఆనంద్ నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్