Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్నార్వే చెస్: ఏడో రౌండ్ లో ఆనంద్ విజయం

నార్వే చెస్: ఏడో రౌండ్ లో ఆనంద్ విజయం

Anand wins 7th:  భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్  నార్వే చెస్ టోర్నమెంట్ క్లాసికల్ విభాగం  ఏడో రౌండ్ లో  విజయం సాధించాడు. అజెర్ బాయిజాన్ ఆటగాడు తైమూర్ రడ్జబోవ్ పై విజయం సాధించాడు. ఈ రౌండ్ తర్వాత 13 పాయింట్లతో ఆనంద్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సేన్ ఆనంద్ కంటే అర పాయింట్ ఎక్కువగా పదమూడున్నర పాయింట్లతో  మొదటి స్థానంలో ఉన్నాడు.

నేడు జరిగిన రెగ్యులర్  మ్యాచ్ లో  42 ఎత్తుల వద్ద డ్రాగా ముగించారు. అనంతరం జరిగిన సడన్ డెత్ మ్యాచ్ లో 25ఎత్తుల్లోనే తైమూర్ ను ఓడించాడు ఆనంద్.

ఆనంద్ ఎనిమిదో రౌండ్ లో అజెర్ బాయిజాన్ కే చెందిన మెమెద్యరోవ్ షక్రియార్ తో తలపడనున్నాడు. చివరి, తొమ్మిదో రౌండ్ లో నార్వే ఆటగాడు తారి ఆర్యన్ తో డీ కొంటాడు.

Also Read :  నార్వే చెస్: ఆరో రౌండ్ లో ఆనంద్ డ్రా 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular