Thursday, June 18, 2026
HomeTrending Newsవిశాఖ ఎంపి భార్య, కుమారుడు, ఆడిటర్ జీవీ కిడ్నాప్

విశాఖ ఎంపి భార్య, కుమారుడు, ఆడిటర్ జీవీ కిడ్నాప్

విశాఖపట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ భార్య నాగ జ్యోతి, కుమారుడు శరత్ తో పాటు  వైసీపీ నేత, ప్రముఖ ఆడిటర్, స్మార్ట్ సిటీ మాజీ ఛైర్మన్ జి. వెంకటేశ్వర రావు కిడ్నాప్ కు గురయ్యారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారి ఆచూకీ కనిపెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్ హేమంత్ ఈ దురాగతానికి పాల్పడ్డట్లు సమాచారం.  ఈ ఉదయం ఎంపి నివాసానికి వెళ్లిన దుండగులు ఆయన భార్య, కుమారుడిని బెదిరించి ఆడిటర్ ను అక్కడికి రప్పించినట్లు ప్రాథమికంగా అందిన వార్తలను బట్టి తెలుస్తోంది. ఆడిటర్ తో పాటు ఎంపి భార్య, కుమారుడిని కూడా వారు తమ వెంట తీసుకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. హేమంత్ 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

కిడ్నాప్ చేసింది హేమంత్ అని నిర్ధారణ చేసుకున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేసి ఏలూరు వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విశాఖ సిపి త్రివిక్రమ్ వర్మ కాసేపట్లో మీడియాకు వివరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular