నేటి నుంచి మూడు రోజుల పాటు విజయనగర ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉదయం ర్యాలీతో ఉత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి, రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది వేదికల్లో విజ్ఞాన, వినోద, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తునారు. వందలాది మంది కళాకారులు తమ ప్రతిభను చాతనున్నారు. విజయనగర సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పేలా ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి తెలిపారు.
మంగళవారం, 11న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవంతో మూడు రోజుల ఉత్సవాలు ముగుత్స్తాయి.
Also Read :