Voter Open Letter To The Chief Minister :

ఇదే
ఈ అహంకారమే..
జనం పిచ్చోళ్ళనే ఈ నమ్మకమే..
మహా మహా నేతల్ని కూడా మట్టికరిపించింది..
ఇటీవలి మీ అనుభవం నుంచి మీరింకా పాఠాలు నేర్చుకున్నట్టు
లేదు.
నిన్న మీరేమన్నారు?
రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడతారా?
ఢిల్లీని నిదరపోనివ్వకుండా చేస్తారా?
అసలు ఆ చట్టాల వల్ల వ్యవసాయం కార్పొరేటైజేషన్
అయిపోతుందా.?
మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది?
రైతులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త చక్కాజామ్
చేసినప్పుడు తెలియదా?
పగలు రాత్రుళ్లు నిద్రాహారాలు మాని నిరశన దీక్షలు
చేస్తున్నప్పుడు తెలియదా?
పోలీసుల పాశవిక లాఠీచార్జిలు జరుగుతున్నప్పుడు తెలియదా?
తీవ్రమైన నేరాల కేసులు పెడుతున్నప్పడు తెలియదా?
చివరికి లఖింపూర్ లో కారు చక్రాల కింద తొక్కించి రైతులను
చంపినప్పుడు కూడా తెలియదా?
అప్పుడెప్పుడూ మీరు నోరెత్తలేదేం?
కనీసం మీ పార్టీలో కూడా ఎవరూ మాట్లాడలేదేం?
అప్పట్లో ఈటల రాజేందర్ ఒక్కరు మాట్లాడినందుకే కదా ఆయన
మీద పగబట్టింది..
ఈలోపు సవాలక్ష అంశాలలో బిజెపికి మద్దతు ఇచ్చారు కదా?
ఈ చట్టాలను ఉపసంహరిస్తేనే మా మద్దతు అప్పుడు
చెప్పలేదే?
మీ లాంటి వాళ్ళ అండతోనే కదా.. మోడీ తను ఏదనుకుంటే
అది చేయగలుగుతున్నాడు.
సరిగ్గా గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో దుబ్బాక, ghmc ఎన్నికల్లో ఓడిపోయారు.
అప్పుడూ కూడా ఇలాగే రైతుచట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో మీ పార్టీ పాల్గొని ఒక పూట హడావిడి చేసింది.
ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అటు వైపు కన్నేసి కూడా
చూడలేదుగా..
తాజాగా హుజూరాబాద్ లో చావుదెబ్బ తిన్నారు.
ఇప్పుడు మళ్ళీ మీకు రైతులు గుర్తుకొచ్చారా?
చట్టాలు..కార్పొరేటైజేషన్ గుర్తొచ్చాయా?
జనమేమనుకుంటారో అని కూడా అలోచించరా?
రాష్ట్రంలో వరి రైతుల సంగతే చూద్దాం.
గోడౌన్లలో వడ్లుకొనాలంటే, భవిష్యత్తులో వడ్లు పండించబోమని
ఎఫ్ సి ఐ హామీ అడిగిందంటున్నారు.
మరి ఆ హమీ అడిగినప్పుడే తెలంగాణా ప్రజలకు ఎందుకు
చెప్పలేదు?
కనీసం హామీ మీద సంతకాలు చేస్తన్నప్పుడైనా ఎందుకు
చెప్పలేదు?
అంటే, అప్పుడు ఢిల్లీ బిజెపితో మీకు
ప్రయోజనాలున్నాయనుకోవాలా?
రైతుల్ని అదిరించో, బెదిరించో వరి మాన్పించొచ్చు లే అనుకున్నారా?
దీన్ని బట్టీ చూస్తుంటే ఈ మధ్య కాలంలో విన్న కొన్ని పుకార్లు
నిజమేనేమో అన్న అనుమానాలొస్తున్నాయి.
హుజూరాబాద్ ఎన్నికలకు ముందు మీరు ఢిల్లీ వెళ్లి కేంద్ర
పెద్దలని కలిసారు.
“మొదటినుంచి మీరడిగిన అన్నిటికీ సహకరిస్తున్నాం.. ఒక్క
హుజూరాబాద్ ఎన్నికను వదిలిపెట్టండి.. భవిష్యత్తులో కూడా
మీరేదడిగితే దానికి సై”.. అని మీరు ఆ సమావేశాల్లో బిజెపి
పెద్దలని వేడుకున్నారని ఢిల్లీ వీధుల్లో ఒకటే టాక్..
కానీ, మూడాకులు ఎక్కువే చదివిన మోడీ,
మీ మాటలని నమ్మలేదు. హుజూరాబాద్ ని వదల్లేదు.
అందుకే మీకు ఇప్పుడింత అక్కసని.. గిట్టనివాళ్ళు
అనుకుంటున్నారు.
మీ మాటలు, చేతలు కూడా అలాగే వున్నాయి.
హుజూరాబాద్ లో రాజేంద్ర ఓడిపోయి.., గెల్లు శీను గెలిచివుంటే,
మీరు ఇలా కేంద్రం మీద పోరాటానికి దిగేవారా?
వరి కొనుగోళ్ళు, పెట్రోల్ రేట్ల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఎన్ని డ్రామాలాడుతున్నాయో జనం గమనిస్తున్నారు.
సమాధానం చెప్పాల్సిననప్పుడు చెప్తారు.
కానీ, రైతులు ప్రాణాలకు తెగించి చేస్తున్న పోరాటాలను కూడా
మీ వ్యక్తిగత రాగద్వేషాలను బట్టి వాడుకుంటారా?
ఒక ఉద్యమపార్టీ నేత అని చెప్పుకునే మీకు ఇది తగినపనేనా?
నయానో భయానో మిమ్మల్ని లొంగదీసుకోవడం తెలిసిన ఢిల్లీ బిజెపి మిమ్మల్ని టచ్ చేయకపోవచ్చు.
ఢిల్లీ లో మీ దోస్తీ తెలిసిన ఇక్కడి గల్లీ బిజెపి మిమ్మల్ని టచ్ చేయలేకపోవచ్చు.
కానీ, తెలంగాణ జనం అన్నీ చూస్తున్నారు..
అన్నీ గమనిస్తున్నారు.
సమయం వచ్చినప్పుడు ఈవిఎమ్ లో ఏ బటన్ టచ్ చేయాలో వాళ్ళకి తెలుసు..
ఆ విషయం మర్చిపోకండి.

ఇట్లు..
-మీ వోటరు.

ఇవి కూడా చదవండి:  

ఒక హుజురాబాద్ ఎన్నో సమాధానాలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *