Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్శిఖర్ ధావన్ సత్తా చాటాలి : లక్ష్మణ్

శిఖర్ ధావన్ సత్తా చాటాలి : లక్ష్మణ్

శ్రీలంక సిరీస్ లో నాయకత్వ బాధ్యతలతో పాటు ఆట తీరుతో కూడా శిఖర్ ధావన్ ఆకట్టుకోవాలని భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వి.వి.ఎస్.లక్ష్మణ్  అభిప్రాయపడ్డాడు. రాబోయే టి-20 వరల్డ్ కప్ లో జట్టు ఓపెనర్ గా చోటు సంపాదించుకోవాలంటే ఈ సిరీస్ లో శిఖర్ తన బ్యాట్ కు పని చెప్పాల్సిందేనని వెల్లడించాడు.

జూలై 13  నుంచి ప్రారంభం కానున్న సిరీస్ లో ఇండియా-శ్రీలంక మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు ఆడనున్నాయి. శ్రీలంక లోని ప్రేమదాస స్టేడియంలోనే ఈ అన్ని మ్యాచ్ లు జరగనున్నాయి. ఇండియా జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్ గా, భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. విరాట్ కోహ్లి నేతృత్వంలోని టెస్టు జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది, ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 4న తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది.  ఆ తర్వాత సెప్టెంబర్ 19 నుంచి  అక్టోబర్ 15 వరకు ఐపిఎల్ మ్యాచ్ లు ఉంటాయి. ఐపిఎల్ పూర్తి కాగానే రెండ్రోజుల వ్యవధిలోనే టి-20 వరల్డ్ కప్ మొదలుకానుంది.

జాతీయ టి-20 జట్టులో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉందని, అందులోనూ ఇన్నింగ్స్ ప్రారంభించే జోడీ కోసం ఎంతోమంది క్యూలో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో శిఖర్ తన ఆటతీరుతో ఆకట్టుకుని పొట్టి ఫార్మాట్ లో తన స్థానం పదిలం చేసుకోవాలని లక్ష్మణ్ ఆకాంక్షించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular