Friday, April 19, 2024
Homeసినిమావాల్తేరు వీర‌య్య ఎంతవ‌ర‌కు వ‌చ్చాడు?

వాల్తేరు వీర‌య్య ఎంతవ‌ర‌కు వ‌చ్చాడు?

Veeraiah: మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర బాబీ కాంబినేష‌న్లో భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి వాల్తేరు వీర‌య్య అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంకా అఫిషియ‌ల్ గా ప్ర‌క‌టించ‌లేదు. ఓ మంచి ముహుర్తాన ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది.

ప్రస్తుతం భోళా శంకర్ షూటింగ్ లో ఉన్న‌ మెగాస్టార్ చిరంజీవి త్వరలో వాల్తేరు వీర‌య్య షూటింగ్ లో జాయిన్ కానున్నారు. కొత్త షెడ్యూల్ జూలై 5 నుండి ప్రారంభమై జూలై 25 వరకు కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా 50 శాతం పూర్తవుతుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. నవంబర్ రెండో రంలోగా షూటింగ్ పూర్తి చేయాలనేది ప్లాన్.

సెప్టెంబర్ నుండి ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక టీజర్‌ను మెగాస్టార్ పుట్టినరోజు ఆగస్టు 22న విడుదల చేస్తున్నట్లు బాబీ తెలియ‌చేశారు. ప‌క్కా మాస్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా మెగా అభిమానుల‌కు ఓ పండ‌గలా ఉంటుంద‌ట‌. రోజురోజుకు ఈ సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అవుతున్నాయి.

Also Read : మెగాస్టార్ బర్త్ డే రోజున భోళా శంక‌ర్ టీజ‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్