Friday, June 12, 2026
Homeసినిమావిజయ్ డేట్ ఫిక్స్ మరి.. చిరు, బాలయ్య..?

విజయ్ డేట్ ఫిక్స్ మరి.. చిరు, బాలయ్య..?

చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసన్ నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు కానీ.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. ఇటీవల ఈ మూవీ నుంచి ‘పార్టీ సాంగ్’ అంటూ ఓ మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. దేవిశ్రీ రాసి పాడిన ఈ పాటకు అనూహ్య స్పందన వచ్చింది.

సంక్రాంతికి చిరంజీవితో పాటు బాలయ్య కూడా ‘వీరసింహారెడ్డి’ అంటూ వస్తున్నాడు. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసనే నటిస్తుంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్సే ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు కానీ.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. ఇటీవల ఈ మూవీ నుంచి ‘జై బాలయ్య’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. త్వరలో మరో సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. సంక్రాంతికి విజయ్ ‘వారసుడు’ మూవీ, అజిత్ మూవీ కూడా రిలీజ్ కానుంది. వారసుడు మూవీని జనవరి 12న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి చిత్రాల రిలీజ్ డేట్స్ ఇంకా ప్రకటించలేదు. దీంతో అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు రిలీజ్ డేట్స్ ప్రకటించమని ప్రొడక్షన్ హౌస్ పై ఒత్తిడి తెస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయనున్నారని తెలిసింది. మరి.. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular