Thursday, June 11, 2026
Homeసినిమాట్రైలర్ తో అంచనాలు పెంచేసిన వీరయ్య

ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తే.. రవితేజకు జంటగా కేథరిన్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య స్పందన లభించింది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… మాస్ యాక్షన్, అంశాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి డైలాగ్స్, స్టైల్, స్వాగ్, డ్యాన్స్, ఫైట్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవిని చూస్తుంటే.. ఓ ఇరవై సంవత్సరాలు క్రితం చిరంజీవిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే చిరంజీవి, రవితేజ పై వచ్చిన సీన్స్ ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. అలానే యక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొత్తంగా పవర్ ప్యాక్డ్ గా మాస్ యాక్షన్ అంశాలతో రూపొందిన వాల్తేరు వీరయ్య ట్రైలర్ మూవీ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసింది. జనవరి 13న వస్తున్న వాల్తేరు వీరయ్య ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular