Sunday, January 19, 2025
Homeసినిమా'వాల్తేరు వీరయ్య' సెన్సార్ టాక్ ఏంటి..?

‘వాల్తేరు వీరయ్య’ సెన్సార్ టాక్ ఏంటి..?

చిరంజీవి, రవితేజ కలిసి నటించిన క్రేజీ మూవీ ‘వాల్తేరు వీరయ్య‘. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తే.. రవితేజకు జంటగా కేథరిన్ నటించింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య స్పందన రావడంతో వాల్తేరు వీరయ్య మూవీ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవిని చూస్తుంటే.. ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయాడా అనిపిస్తుంది. పైగా ఈమధ్య కాలంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాల్లో లేని ఎంటర్ టైన్మెంట్ ఈ మూవీలో ఉండడంతో వాల్తేరు వీరయ్య విజయం ఖాయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు.

అయితే.. ఇటీవల వాల్తేరు వీరయ్య సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్  ఈ మూవీ టీమ్ ను అభినందించిందని.. చిరంజీవి, రవితేజలను తెరపై చూస్తుంటే.. పండగలా అనిపించిందని బోర్డ్ మెంబర్స్ చెప్పారని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో  సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది.

ఇంతకీ రియల్ సెన్సార్ టాక్ ఏంటంటే… సినిమా ఫస్టాఫ్‌ పక్కా ఎంటర్ టైన్ మీదనే సాగిందట. అయితే.. మార్కుల లెక్కలు చూస్తే ఫస్టాఫ్‌ కన్నా సెకండాఫ్ కి ఎక్కువ మార్కులు పడతాయని టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్ లో రవితేజ ఎపిసోడ్ నలభై నిమషాలకు పైగా వుందట. ఈ ఎపిసోడ్ మీదే సినిమా కీలకంగా ఆధారపడింది. ఈ ఎపిసోడ్ చివర్లో చిరు.. రవితేజల మధ్య వచ్చే ఎమోషన్ సీన్లు బాగానే పండాయట. అలాగే సినిమాలో రెండు పాటల చిత్రీకరణ బాగుందని అంటున్నారు. ఓవరాల్ గా ఇది రొటీన్ స్టోరీనే అయినా సంక్రాంతికి కరెక్ట్ సినిమా అన్నది సెన్సార్ టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్