Friday, June 12, 2026
Homeసినిమావీరయ్య, బాల‌య్య సినిమాల‌ ర‌న్ టైమ్ ఎంతంటే...

వీరయ్య, బాల‌య్య సినిమాల‌ ర‌న్ టైమ్ ఎంతంటే…

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య‘. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్… రవితేజ సరసన కేథరిన్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య చిత్రాన్ని జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న వైజాగ్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ మూవీ రన్ టైమ్ లాక్ అయ్యింది. 2 గంటల 33 నిమిషాలు.

ఇదిలా ఉంటే.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్  కావడం, దీన్ని కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తుండడం విశేషం.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమా రన్ టైమ్ కూడా లాక్ అయ్యింది. ఇంతకీ ఎంతంటే.. 2 గంట‌ల 43 నిమిషాలు అని సమాచారం. ఓ ర‌కంగా బాల‌య్య సినిమా లెంగ్తీగా ఉన్న‌ట్టే లెక్క. అయితే అఖండ 2 గంట‌ల 45 నిమిషాల సినిమా. అయినా జ‌నం చూశారు. సినిమా బాగుంటే ర‌న్ టైమ్ ఎక్కువు ఉన్నా ఏం ఫర్లేదు. కాబ‌ట్టి.. 2 గంట‌ల 43 నిమిషాలు పెద్ద మేట‌రేం కాదు. మరి.. వీరయ్య, బాలయ్య ఈ రెండు చిత్రాల్లో విజేతగా నిలిచేది ఎవరో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular