Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఇండియా 276/7 డిక్లేర్డ్, కివీస్ 140/5

ఇండియా 276/7 డిక్లేర్డ్, కివీస్ 140/5

India towards win:
ముంబై టెస్టులో ఇండియా గెలుపు దిశగా పయనిస్తోంది. రెండో ఇన్నింగ్స్ ను 276 పరుగులకు డిక్లేర్ చేసి న్యూజిలాండ్ ముందు 540 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిన్న వికెట్ నష్టపోకుండా 69 పరుగులతో నేటి ఆట మొదలుపెట్టింది ఇండియా. మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీ (62) చేయగా… పుజారా(47), శుభమన్ గిల్(47) ఇద్దరూ  మూడు పరుగుల తేడాతో అర్ధసెంచరీ మిస్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ-36, శ్రేయాస్ అయ్యర్-14; వృద్ధిమాన్ సాహా-13; అక్షర్ పటేల్-41(నాటౌట్);  జయంత్ యాదవ్-6 పరుగులు చేశారు.  తొలి ఇన్నింగ్స్ లో మొత్తం పది వికెట్లూ రాబట్టిన కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర మూడు వికెట్లు తీశారు.

కివీస్ 237 ఓవర్లు- 540 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. కానీ మరోసారి అశ్విన్ స్పిన్ మ్యాజిక్ కు 13 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ లాథమ్ 6 పరుగులు చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. 45 పరుగుల వద్ద మరో ఓపెనర్ యంగ్ (20)ను, 55 వద్ద రాస్ టేలర్ (6)ను కూడా అశ్విన్ అవుట్ చేసి కివీస్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. అర్ధసెంచరీ చేసి మంచి ఊపుమీదున్న డేరిల్ మిచెల్ (60)  ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. టామ్ బ్లండేల్ (0) రనౌట్ అయ్యాడు.  మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 140 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్-36; రచిన్ రవీంద్ర-2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు, అక్షర్ ఒక వికెట్ రాబట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్