Wednesday, March 26, 2025
HomeTrending NewsKhalistan: అమృత్‌పాల్‌ సింగ్‌పై లుకౌట్ సర్క్యులర్

Khalistan: అమృత్‌పాల్‌ సింగ్‌పై లుకౌట్ సర్క్యులర్

ఖలిస్థాన్  వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే ’ చీఫ్ అమృత్‍పాల్ సింగ్  పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. అతని కోసం పంజాబ్‌ పోలీసులు గత ఐదు రోజులుగా వేట కొనసాగిస్తున్నారు. పంజాబ్‌తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నారు. అయినప్పటికీ అతని జాడ మాత్రం తెలియట్లేదు. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్‌ సింగ్‌పై పోలీసులు లుకౌట్‌ సర్క్యులర్, నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఇష్యూ చేశారు.

ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుఖ్‌చైన్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. అమృత్‌పాల్ సింగ్‌ను ఇంకా అరెస్టు చేయలేదని చెప్పారు. ‘ పరారీలో ఉన్న అమృత్‌పాల్‌ సింగ్‌పై లుకౌట్ సర్క్యులర్, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశాం. మేము అతనిని అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అతడిని త్వరలోనే పట్టుకుంటామని ఆశిస్తున్నాం… అది చెప్పడం చాలా కష్టం. పంజాబ్ పోలీసులకు ఇతర రాష్ట్రాలు, కేంద్ర సంస్థల నుంచి కూడా పూర్తి సహకారం అందుతోంది’ అని ఐజీపీ తెలిపారు.

మరోవైపు అమృత్‌పాల్‌ సింగ్‌ పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. అతను వివిధ వేషధారణల్లో తిరుగుతున్నట్టు పంజాబ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు వివిధ వేషధారణల్లో ఉన్న అమృత్‌పాల్‌ ఫొటోలను పోలీసులు మంగళవారం విడుదల చేశారు. క్లీన్ షేవ్, గడ్డం లేకుండా పోలీసులు ఆయన ఎలా ఉంటారనే దానిపై చిత్రాలను విడుదల చేశారు. ఈ ఫొటోలో వ్యక్తిని పోలినట్లుగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పంజాబ్‌ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిందితుడి అరెస్ట్‌కు సహకరించాలని కోరారు.

Also Read : ఖలిస్థానీ అమృత్ పాల్ సింగ్‌ అరెస్ట్…పంజాబ్‌లో ఇంటర్నెట్ బంద్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్