Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్Sunder in: దీపక్ చాహర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్

Sunder in: దీపక్ చాహర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్

సౌతాఫ్రికాతో జరగనున్న మిగిలిన రెండు వన్డేలకు దీపక్ చాహర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. మూడు టి20లు, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఇండియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. టి 20సిరీస్ ను ఇండియా 2-1తేడాతో గెల్చుకుంది. లక్నో లో జరిగిన మొదటి వన్డేలో సౌతాఫ్రికా 9 పరుగులతో విజయం సాధించింది. రెండో వన్డే రేపు రాంచీ, మూడో వన్డే ఈనెల 11న ఢిల్లీ లో జరగనున్నాయి.

అయితే సౌతాఫ్రికాతో జరిగిన చివరి టి 20లో దీపక్ చాహర్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీని కారణంగానే తొలి వన్డేలో ఫైనల్ లెవెన్ లో చోటు దక్కించుకోలేక పోయాడు.  చాహర్ ను బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వైద్యుల పర్యవేక్షణ కోసం పంపి అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేసింది బిసిసిఐ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular