Sunday, January 19, 2025
Homeసినిమాఆ  రాజీనామాలు ఆమోదించాం: విష్ణు

ఆ  రాజీనామాలు ఆమోదించాం: విష్ణు

MAA – Resignations:
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఎన్నికైన సభ్యులు చేసిన రాజీనామాలను ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమోదించారు. ఈ విషయాన్ని విష్ణు మీడియాకు వెల్లడించారు. రాజీనామాలు చేసినవారి స్థానంలో కొత్తవారిని కొంతమందిని తీసుకున్నామని, అసలు పోటీ చేయని వారిని కూడా మరికొంతమందిని కార్యవర్గంలోకి తీసుకుంటామన్నారు.

మెడికవర్ ఆస్పత్రి సహకారంతో మా సభ్యులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 250 మంది సభ్యులు వైద్య పరీక్షల కోసం శిబిరానికి వచ్చారు.  పది నుంచి పదిహేను వేల రూపాయల ఖర్చయ్యే  వైద్య పరీక్షలు  ఉచితంగా నిర్వహించారని, ఆస్పత్రి ఛైర్మన్  డా. అనిల్ కృష్ణ కు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీ, జాయింట్ సెక్రటరీ గా ఉత్తేజ్ లతో పాటు….. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎన్నికైన ఎనిమిది మంది…బ్రహ్మాజీ, శివారెడ్డి, ప్రభాకర్, తనీష్, సురేష్ కొండేటి, సుడిగాలి సుదీర్, సమీర్, కౌశిక్ ల రాజీనామాలను ఆమోదించినట్లు చెప్పారు.

రాజీనామాలు ఉపసంహరించుకోవాని వారిని తానూ స్వయంగా ఫోన్ చేసి కోరానని, అయినా వారు అంగీకరించలేదని, వారి స్థానంలో అదే ప్యానల్ నుంచి పోటీచేసి ఓడిపోయిన వారినైనా నియమించేందుకు కూడా చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అందుకే రాజీనామాలు ఆమోదించాల్సి వచ్చిందని విష్ణు తెలియజేశారు.

Also Read : ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ 11 మంది మూకుమ్మ‌డి రాజీనామా

RELATED ARTICLES

Most Popular

న్యూస్