Sunday, September 8, 2024
HomeTrending NewsAmbati: ప్యాకేజ్ ఇలా ఇస్తున్నారేమో: రాంబాబు అనుమానం

Ambati: ప్యాకేజ్ ఇలా ఇస్తున్నారేమో: రాంబాబు అనుమానం

చంద్రబాబు తాను ఇవ్వాల్సిన ప్యాకేజీని నిర్మాత విశ్వప్రసాద్ ద్వారా పవన్ కళ్యాణ్ కి అందిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు.  నిన్నటివరకు బ్రో సినిమా 55.26 కోట్ల షేర్ వచ్చిందని, ఒక అట్టర్ల్ ఫ్లాప్ సినిమాను అద్భుతమని చెబుతున్నారని,  పవన్ తన సినిమాలో శ్యాం బాబు అనే కేరెక్టర్ ని పెట్టి నన్ను కించపరిచాడని,  దీనికి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ…పదే పదే నాపై విమర్సలు చేసి కలెక్షన్లు పెంచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.  సినిమాను సినిమాగా తీస్తే బాగుంటుందని,  అంతేగాని..ఎవరో డబ్బులు పెట్టి తీస్తే…దాంట్లో తమకు నచ్చనివారిపై సెటైర్లు వేస్తే ఆ సినిమా జనాదరణ పొందదని రాంబాబు సలహా ఇచ్చారు.

అనవసరంగా ఎవరిని పడితే వారిని కెలకడం సరికాదని తెలుగు చలన చిత్ర నిర్మాతలు, నటులు, దర్శకులు, త్రివిక్రమ్ లాంటి రచయితలు దృష్టిలో ఉంచుకోవాలని…. మళ్ళీ మళ్ళీ ఇలాంటివి తీస్తే తగిన గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని, తగిన మూల్యం  చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సినిమాకి మొత్తంగా 60 కోట్లు వస్తే…దాంట్లో పవన్ కి ఇచ్చిందే 50 కోట్లు అని ఇకపై కూడా పవన్ సినిమాలు ఇలాగే ఫ్లాప్ అవుతాయని జోస్యం చెప్పారు.  వారాహి అనే అమ్మవారి పేరు పెట్టుకుని ఆ వాహనం పై ఊరేగుతూ అవాకులు చవాకులు మాట్లాడితే అమ్మవారి శాపం తగులుతుందన్నారు.  ‘రాజకీయంగా ,సినిమాల పరంగా పవన్ కి పతనం తప్పదని ఆనాడే చెప్పాను…ఇప్పుడు జరుగుతున్నది అదే’ అని రాంబాబు వ్యాఖ్యానించారు,

ఉద్దేశ పూర్వకంగా ఒకరిని కించపరుస్తూ సినిమా తీసేటప్పుడు విశ్వప్రసాద్ వంటి నిర్మాతలు కూడా జాగ్రత్త వహించాలని హితవు పలికారు. ఇతనికి అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీలున్నాయని,  టీడీపీ బ్యాచ్ అమెరికాలో డబ్బులు కలెక్షన్ చేసి విశ్వప్రసాద్ కి ఇస్తే…ఆ సొమ్మును పవన్ కి ప్యాకేజీ రూపం లో ఇచ్చి సినిమా తీశారని ఆరోపించారు. అంతర్జాతీయ నిఘా సంస్థల్లో ముఖ్యమైన వారు తనకు ఈ విషయం చెప్పారని వ్యంగ్యంగా అన్నారు.

సినిమాలు తీస్తే నాకు రోజుకి 2 కోట్లు వస్తాయని పవన్ చెప్పాడని,  ఈ సినిమాకి 23 రోజులు పవన్ పని చేశాడని కొందరు, 40 రోజులు పని చేశాడని మరికొందరు అంటున్నారని,  ఈ లెక్కన పవన్ 46 కోట్లు తీసుకున్నారా ? లేక 80 కోట్లు తీసుకున్నారా ? చెప్పాలని కోరారు.  నిర్మాత విశ్వప్రసాద్ తన నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకే సినిమాలు తీస్తున్నారేమోనని రాంబాబు అన్నారు.

మేము కూడా ఒక సినిమాను తీయాలనుకుంటున్నామని, ఒక చిన్న కుటుంబం సినిమాల్లో రాణించి సెలబ్రిటీలుగా ఎదుగుతారని,  ఆ ఇంట్లో ఒక కుర్రాడు పాపం ప్రవర్తన సరిగా లేక అక్కడక్కడా తప్పిపోతు…మళ్ళీ దొరికిపోతూ ఉంటాడని, చివరికి సినిమాల్లో అవకాశ మిస్తే సెలబ్రిటీ అవుతాడని,  ఆతరువాత వివాహం చేస్తే…సక్రమంగా ఉండక..రెండేళ్ళకొక భార్యని మారుస్తాడమో రాంబాబు వివరించారు.  ఈ సినిమాకి క్లైమాక్స్ ఏమిటంటే…  భార్యలందరూ వారి వారి పిల్లలూ కలిసి ఈ నిత్య కల్యాణ్ కి తగిన విధంగా బుద్ధి చెబుతారని వ్యంగ్యంగా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్