Need BC Census:
బీసీలు ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే వారికి సరైన న్యాయం చేయగలుగుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీ జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. బిసిగణనపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సిఎం జగన్ మాట్లాడారు. సమాజంలో కొద్దిమంది మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటున్నారని, బీసీలను దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్ధికంగా వారిని ఎదగనివ్వడంలేదని సిఎం వ్యాఖ్యానించారు. అందుకే బీసీలను లెక్కించి వారికి కుల పరంగా మరింత న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సిఎం చేసిన ప్రసంగాలోని ముఖ్యాంశాలు
⦿ కులాల వారీగా జనగణన చేసి 90 ఏళ్ళు దాటింది
⦿ బ్రిటిష్ హయాంలో 1931లో కులపరమైన జన గణన జరిగింది
⦿ నాటి నుంచి బీసీల జనాభా అందాజాగా లెక్కిస్తున్నారు తప్ప కచ్చితమైన లెక్కలేదు
⦿ దేశంలో బీసీల జనాభా 52 శాతంగా ఉంది
⦿ బీసీల సంఖ్య నిర్దిష్టంగా ఎంత ఉందనేది తెలిస్తే అప్పుడే వారికి న్యాయం చేయగలుగుతాం
⦿ అందుకే కులాల వారీగా బీసీ జనగణన చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నాం
⦿ లంచాలు, వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
⦿ మా పార్టీకి ఒతేశారా లేదా అని ఆలోచించకుండా అందరికీ మంచి చేస్తున్నాం
⦿ సామాజిక న్యాయం కనిపించేలా ప్రతి అడుగు వేస్తున్నాం
⦿ గత ప్రభుత్వంలో సంక్షేమం కొందరికే పరిమితమైంది
⦿ బీసీలను బ్యాక్ వర్డ్ క్లాసు కాదు, బ్యాక్ బోన్ క్లాస్ గా మార్చేందుకు రెండున్నరేళ్లుగా కృషి చేస్తున్నాం
⦿ రాష్ట్రంలో శాశ్వత బీసీ కమిషన్ పనిచేస్తోంది
⦿ బీసీ వర్గాలు ఒక్కటిగాఉండాలి
⦿ విభజించు, పాలించు అనే విధానాన్ని అరికట్టాలి, దానికి మేం వ్యతిరేకం
Also Read : నేడు మండలి రద్దు బిల్లు ఉపసంహరణ?