Saturday, January 18, 2025
HomeTrending Newsవిజయం మాదే: జగదీశ్ రెడ్డి

విజయం మాదే: జగదీశ్ రెడ్డి

We are going to win:
స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి ఘనవిజయం సాధించబోతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రంలో మంత్రి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, కొందరు ఇతర పార్టీల సభ్యులు కూడా టిఆర్ఎస్ వైపు నిలవడం శుభపరిణామని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ ఆధారితమైన నల్లగొండ జిల్లా కేసీఆర్ పాలనలో ఎంత ససశ్యామలం అయిందో స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తించారని,  ఇందుకే ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు తమకు ఓటేశారని, ఉహించనంత మెజార్టీతో కోటిరెడ్డి గెలవబోతున్నారని జగదీశ్ రెడ్డి జోస్యం చెప్పారు. తాము పెద్ద పెద్ద నాయకులమని గొప్పలు చెప్పుకునే కాంగ్రేస్ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు తిప్పికొట్టారన్నారు. ఈ విజయం తమ పార్టీ శ్రేణులకు మరింత బలం ఇవ్వనుందని చెప్పారు.

Also Read : చేనేత అభివృద్ధికి కేంద్రం సహకరించాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్