Friday, April 19, 2024
HomeTrending Newsచేనేత అభివృద్ధికి కేంద్రం సహకరించాలి

చేనేత అభివృద్ధికి కేంద్రం సహకరించాలి

Center to support:
రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ వంతు చేయూత ఇస్తున్నామని, కానీ కేంద్ర సర్కార్ చిన్న భరోసా కూడా ఇవ్వడం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖల మంత్రి కేటియార్ ఆరోపించారు. చేనేత అభివృద్ధికి తోడ్పడాలని ఏడున్నర ఏండ్లుగా ఎన్నో సార్లు విన్నవించినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  కేటియార్ నేడు సిరిసిల్లలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనారు, అనతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్  హ్యాండ్లూమ్ ఏర్పాటు చేయాలని,  పోచంపల్లి, నారాయణ్ పేట, గద్వాల్, దుబ్బాక లలో పవర్ లూమ్ క్లస్టర్లు మంజూరు చేయాలని తాము కోరినా ఇంతవరకూ వాటి విషయంలో స్పందన కరువైందని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ పట్ల చూపిస్తున్న వివక్షపై ఇక ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర బిజెపి నేతలు తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలని, రాబోయే బడ్జెట్ లో హ్యండ్లూమ్, క్లస్టర్ల ఏర్పాటుకు నిధులు కేటాయించేలా చూడాలని అయన డిమాండ్ చేశారు.

చేనేత కార్మికుల కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని, గతంలో కంటే తమ పరిస్థితి మెరుగయ్యిందని చేనేత కార్మికులు స్వయంగా చెబుతున్నారని అయన సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని నేతన్నలకు 1134 కోట్ల రూపాయలతో ఉపాధి కల్పించామని, దుస్తుల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కేటియార్ అభిప్రాయ పడ్డారు.  కార్మికుడిని యజమానిని చేసేలా వర్కర్ టూ ఓనర్ పథకానికి శ్రీకారం చుట్టామని, దీనికోసం 400 కోట్ల రూపాయలు కేటాయించామని అయన వెల్లడించారు.

Also Read :త్వరగా పూర్తి చేయండి: కెసియార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్