Sunday, January 19, 2025
HomeTrending Newsఎలాంటి బాధ లేదు: రాజీనామాలపై నాని

ఎలాంటి బాధ లేదు: రాజీనామాలపై నాని

Nothing to worry: ప్రస్తుత కేబినెట్ చివరి సమావేశం ఆహ్లాదంగా, ఉత్తేజభరితంగా సాగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మంత్రులందరం సంతోషంగా తమ రాజీనామాలు సమర్పించామన్నారు. ప్రమాణ స్వీకారం రోజునే రెండున్నరేళ్ళ తరువాత మంత్రివర్గాన్ని పూర్తిగా మారుస్తానని సిఎం జగన్ చెప్పినందున పదవి పోతుందనే బాధ తమకెవరికీ లేదని స్పష్టం చేశారు. అనుభవాన్ని, ప్రభుత్వ అవసరాలను, సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని కొందరిని కొనసాగిస్తామని సిఎం జగన్ చెప్పారని, ఎవరెవరు, ఎంతమంది అనేది తెలియదని వెల్లడించారు. నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పేర్ని నాని మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రివర్గం రాజీనామా, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా నాని స్పందించారు.

పవన్ కళ్యాన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని పేర్ని మండిపడ్డారు. ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ కాదన్నారు. అయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు ఎవరితో పొత్తులో ఉంటారో ఎవరికీ తెలియదని విమర్శించారు. ప్రజలు అయన మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేవలం ఒక హాబీగా మాత్రమే రాజకీయాలు చేస్తున్నారన్నారు. పవన్ మొదట్లో చేగువేరా, పూలే, బిజెపి, చంద్రబాబు, మాయావతి, కమ్యూనిస్టులు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఫోటో పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

వైఎస్సార్  సున్నా వడ్డీ మూడో ఏడాది కార్యక్రమాన్ని ఏప్రిల్ ­22న నిర్వహిస్తున్నట్లు పేర్నిచెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని తిరిగి వారి అకౌంట్లలో రీ-ఇంబర్స్ చేస్తారని తెలిపారు.

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని:

  • పులివెందుల, కొత్తపేట కొత్త రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం
  • 12 పోలీస్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు నిర్ణయం
  • కొత్త జిలాల ఏర్పాటు జరిగినా, జడ్పీలు, పంచాయతీలు పాత జిల్లాల ప్రాతిపదికగానే ఈ పదవీకాలం కొనసాగుతాయి
  • ఏపీ మిల్లెట్ మిషన్ కార్యక్రమాన్ని 2025-2026 వరకూ కొనసాగిస్తూ నిర్ణయం
  • ఉన్నత విద్యలో 253 పోస్టులకుఆమోదం
  • విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది
  • ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేయదాన్ని నిషేధిస్తూ మార్గదర్శకాలు రూపొందించాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశం
  • రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో టీచింగ్, నాట్ టీచింగ్ స్టాఫ్ నియామకానికి ఆమోదం
  • పలు డిగ్రీ, పాలిటెక్నిక్ కాలీజీల శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తూ నిర్ణయం
  • పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా 12 పోస్టులకు ఆమోదం

Also Read : 11న కేబినెట్ విస్తరణ: బీసీలకు పెద్దపీట?

RELATED ARTICLES

Most Popular

న్యూస్