Friday, March 29, 2024
HomeTrending Newsవినాయకుడి పేరుతొ రాజకీయమా?: విష్ణు

వినాయకుడి పేరుతొ రాజకీయమా?: విష్ణు

వినాయక చవితి పందిళ్ళపై ఆంక్షలు విధిస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను వైఎస్సార్సీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. 2014-19 మధ్య ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం విధించిన ఆంక్షలు  కొనసాగుతున్నాయి కానీ,  ఈ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధనలూ అమలు చేయలేదన్నారు, పైగా తమ ప్రభుత్వం వినాయక చవితి పందిళ్ళకు వసూలు చేసే కరెంట్ ఛార్జీలు తగ్గించిందని  స్పష్టం చేశారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు ఆంక్షలు విధించిందని, అప్పుడు కూడా తమపై అభాండాలు వేశారని విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి రాష్ట్ర అద్యక్షుడు వినాయక చవితి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరిద్దరిపై కేసు  కూడా పెడతామన్నారు. సోము వీర్రాజుకి బుద్ధి ఉంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలపై ప్రశ్నించి వాటిని అమలు చేసేలా చొరవ చూపాలి గానీ ఇలాంటి అంశాలపై విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. వీరికి ఎలాంటి అంశాలూ లేక పండుగను రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. పందిళ్ళలో పెట్టె మైకులు, డిజేలకు సంబంధించి కూడా తాము గత నిబంధనలను ఎక్కడా మార్చలేదని తేల్చి చెప్పారు.

చంద్రబాబు హయాంలో కెనాల్ రోడ్డులోని వినాయక ఆలయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే తాము అడ్డుకున్నామని, అప్పుడు ప్రభుత్వం వెనక్కు వెళ్లిందని విష్ణు గుర్తు చేశారు. సిఎం జగన్ కాణిపాకంలో విఘ్నేశ్వరుడికి ఆరు కోట్ల రూపాయలతో బంగారు రథాన్ని తయారుచేయించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. పండుగలను కూడా ఈ విధంగా రాజకీయాలకు వాడుకోవడం దారుణమని, నేతలు దిగజారి వ్యవహరించడం తప్పని హితవు పలికారు.  దేవుల్లపై ఇలాంటి రాజకీయాలు చేయడం కంటే ఆత్మా హత్య చేసుకోవడం మంచిదని గాటుగా వ్యాఖ్యానించారు. విఘేశ్వరుడిని అడ్డు పెట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వీరిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్