Tuesday, July 9, 2024
HomeTrending Newsవెనక్కి తీసుకోవడం కుదరదు : సజ్జల

వెనక్కి తీసుకోవడం కుదరదు : సజ్జల

Stalemate: పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  పీఆర్సీ ఇప్పటికే ప్రకటించామని, దాని ప్రకారం మొదటి నెల జీతాలు కూడా ఈ సాయంత్రానికి ఉద్యోగుల అకౌంట్లలో పడతాయని ఈ పరిస్థితుల్లో ఆ జీవోల ఉపసంహరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలు ప్రభుత్వం నియమించిన కమిటీతో నేడు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఉద్యోగ నేతలు మూడు డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు. వాటిలో పీఆర్సీ జీవోల రద్దు, పాత జీతాల కొనసాగింపు, అశుతోష్ మిశ్రా కమిటి నివేదిక బహిర్గతం ఉన్నాయి. జీతాల విషయంలో ప్రభుత్వానికి అంత తొందర ఎందుకని ప్రశ్నించారు. అయితే ఈ మూడింటిలో రెండు సాధ్యం కాదని, అశుతోష్ మిశ్రా నివేదిక విషయంలో సిఎం తో చర్చించి నిర్ణయం చెబుతామని స్టీరింగ్ కమిటీకి మంత్రుల కమిటీ బదులిచ్చింది. ఉద్యోగ సంఘాల నేతలు అందుబాటులో ఉండాలని సూచించింది. సమావేశం తరువాత సజ్జల మీడియాతో మాట్లాడారు.

కొంత ఆలస్యంగా నా చర్చలు మొదలయ్యాయి కాబట్టి ఉద్యమ కార్యాచరణ వాయిదా వేసుకోవాలని కోరామని. అయితే ఇప్పటికే కార్యక్రమం ప్రకటించాం కాబట్టి దాన్ని కొనసాగిస్తామని చెప్పారని సజ్జల వివరించారు. తాము ఓపెన్ మైండ్ తో ఉన్నామని చెప్పారని, తాము మొదటి నుంచీ అలాగే ఉన్నామన్నారు.

పరిస్థితులు అనుకూలించక పోవడం వల్లే ఉద్యోగులు ఆశించిన స్థాయిలో పీఆర్సీ ఇవ్వలేకపోయామని, ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సజ్జల వెల్లడించారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. పీఆర్సీ విషయంలో హైకోర్టు తీర్పుపై సజ్జల స్పందిస్తూ ఉద్యోగుల వద్ద నుంచి ప్రభుత్వం ఏమీ రికవరీ చేయడం లేదు కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాబోదన్నారు. మధ్యంతర భ్రుతి అనేది అడ్జెస్ట్ మెంట్ కాబట్టి రికవరీ కిందకు రాదన్నారు. సమ్మెకు వెళ్ళవద్దని హైకోర్టు కూడా సూచించి నట్లు తెలిసిందని, తాము కూడా అదే చెబుతున్నమన్నారు. ఉద్యోగులతో చర్చలు కొనసాగుతూనే ఉంటాయని సజ్జల వెల్లడించారు.

Also Read :ఈ పీఆర్సీ మాకొద్దు : ఉద్యోగ సంఘాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్