రెండో మ్యాచ్ లోనూ ఇండియాదే విజయం

India won again: మహిళల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ టోర్నీలో భాగంగా నేడు చైనాతో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా ఇండియా 2-1 తేడాతో విజయం సాధించింది.  ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ 2021-22 లో భాగంగా మొత్తం టోర్నీలో ఆరో మ్యాచ్ ఒమన్, మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా నేడు  జరిగింది.

మూడవ నిమిషంలోనే గుర్మీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి ఇండియాకు బోణీ చేసింది. ఆట 39 వ నిమిషంలో చైనా ఫీల్డ్ గోల్ ద్వారా స్కోరు సమం చేసింది అయితే 49న నిమిషంలో గుర్మీత్ మరో పెనాల్టీ కార్నర్ గోల్ సాధించింది.

ఆటలో మంచి డిఫెన్సు ప్రదర్శించిన మౌనిక కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది. 

Also Read : చైనాపై ఇండియా ఘన విజయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *