Saturday, January 18, 2025
Homeసినిమాప‌వ‌న్ ఫ్యాన్స్ గ‌ర్వించేలా చేస్తానంటున్న రౌడీ హీరో

ప‌వ‌న్ ఫ్యాన్స్ గ‌ర్వించేలా చేస్తానంటున్న రౌడీ హీరో

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో  రూపొందిన సినిమా  ‘లైగ‌ర్’. దీని త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌ నటిస్తోన్న చిత్రం ‘ఖుషి. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తోంది.  ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రాన్ని శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఖుషి అనే పేరు వినగానే పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ గుర్తుకు వస్తుంది. ఆ సినిమా టైటిల్ ను విజయ్ దేవరకొండ సినిమాకు పెట్ట‌డం అంటే సాహస నిర్ణయమే అని చెప్ప‌చ్చు. ఫలితం కాస్తా తేడా కొడితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్ లో ఆడేసుకోవడం ఖాయం. అయితే.. విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు.  పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి స్థాయిలో  మా ఖుషి కూడా ఉంటుందని అన్నాడు. ఈ  సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ జనరేషన్ మొత్తానికి కూడా ఖుషి అందించిన  సినిమా అది,  అలాంటి సినిమా టైటిల్  పెట్టుకున్న మా సినిమాకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు. మా ఖుషి సినిమా చూసిన తర్వాత తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గర్విస్తారు అని విజయ్ దేవరకొండ చెప్పారు.

Also Read : ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌ “ఖుషి” 

RELATED ARTICLES

Most Popular

న్యూస్