Saturday, January 18, 2025
HomeTrending Newsఆ అవసరం మాకేంటి? సజ్జల

ఆ అవసరం మాకేంటి? సజ్జల

No question: కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదని  ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో  ఏ పార్టీతో పొత్తు ఉండబోదని, ఒంటరిగా వెళ్ళాలన్నది సిఎం జగన్ సిద్ధాంతమని సజ్జల తేల్చి చెప్పారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి సమర్పించిన ప్రెజెంటేషన్ లో వైసీపీ పేరు ప్రస్తావించడం.. తద్వారా ఈ విషయంలో గత కొన్నిరోజులుగా వస్తున్న ఊహాగానాలను సజ్జల కొట్టిపారేశారు.  పార్టీ పెట్టిన తొలి రోజునుంచే తాము ఈ విషయంలో స్పష్టతతో ఉన్నామని, ‘ప్రజల ఆశీస్సులు మనకు ఉండాలి, వారి ఆకాంక్షలకు మనమే జవాబుదారీగా ఉండాలన్నది’ సిఎం జగన్ ఆలోచన అని చెప్పారు. రాత్రికి రాత్రి పొత్తులు పెట్టుకొని, పొద్దున్నే విడిపోయే విధానాలను జగన్  ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరని సజ్జల అన్నారు.

వైఎస్సార్సీపీ బలంగా ఉంది కాబట్టి పొత్తు పెట్టుకోవాలని ఎవరైనా అనుకోవచ్చని, దానితో తమకు సంబంధం లేదని సజ్జల చెప్పారు. ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో మంచి ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందారని, అదృష్టవశాత్తూ గత ఎన్నికల్లో తమతో కలిసి పనిచేశారని, ఆయన పట్ల జగన్ వ్యక్తిగతంగా అభిమానంతో ఉంటారని…. అంతమాత్రాన ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగత అభిప్రాయంతో తమకు సంబంధం లేదన్నారు సజ్జల.

Also Read : ఇచ్చట వ్యూహాలు అమ్మబడును      

RELATED ARTICLES

Most Popular

న్యూస్