Sunday, January 19, 2025
HomeTrending Newsఇదొక చరిత్ర: చెల్లుబోయిన

ఇదొక చరిత్ర: చెల్లుబోయిన

అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలోనే 99 శాతం హామీలు అమలు చేయడం దేశంలోనే ఓ చరిత్ర అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా ఎగ్గొట్టాలనేది బాబు విధానమైతే, ఎలాగైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నది జగన్ విశ్వసనీయత అని అభివర్ణించారు. బాబు రాజకీయాలను భ్రష్టుపట్టించారని, ఆయనకు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా రామచంద్రాపురంలో అయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99(98.44శాతం) శాతం ఇప్పటికే, అంటే మూడేళ్ళలోనే అమలు చేశాం. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేశారు. దేశ చరిత్రలో మరే రాజకీయ పార్టీగానీ, రాజకీయ నేతగానీ ఇలా చేయలేదు.
  • అక్టోబరు 1 నుంచి వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా పథకాలు అమల్లోకి వస్తున్నాయి. గత ప్రభుత్వం కంటే అధికంగా తమ ప్రభుత్వం అందజేస్తోంది.
  • గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇలాంటి పథకాన్ని ప్రకటించి సుమారు 17వేలమందికిపైగా జంటలకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా, సుమారు 68 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు.
  • ద్రబాబు 2014 మేనిఫెస్టోలో 600కు పైగా హామీలు ఇచ్చి… వాటిని పూర్తిగా ఎగ్గొట్టిన ఘనుడు. ఇవ్వడానికే హామీలు గానీ, అమలు చేయడానికి కాదు అన్నుట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. ప్రజలు అడగరని, ఎన్నికల తర్వాత వారికి గుర్తుండదని, మరచిపోతారన్నది.. చంద్రబాబు భావన. చంద్రబాబుకు మనస్సాక్షి అనేదే లేదు.
  • చంద్రబాబు హయాంలో మొత్తంగా రాజకీయ వ్యవస్థపైనే నమ్మకం సడలిపోయింది. అపనమ్మకం పెరిగింది. మొత్తం రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టించారు చంద్రబాబు.
  • చంద్రబాబు హామీలు ఇచ్చి.. ఎప్పుడైనా అమలు చేశారా? రైతులకు రుణమాఫీ చేస్తానంటూ.. హామీ ఇచ్చి ఎగ్గొట్టాడు.
  • ఒకవైపు చంద్రబాబు చేసిన అప్పుల భారాన్ని మోస్తూ మరోవైపు వైయస్‌.జగన్‌గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. మా ప్రభుత్వం మూడేళ్ళలోనే రూ. 1.65 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలకు ఖర్చు చేసింది.
  • చంద్రబాబు చేస్తున్నవన్నీ దారుణాతి దారుణమైన కుట్ర రాజకీయాలు. ప్రజలను ఎలా మోసం చేయాలి. తద్వారా ఎలా అధికారంలోకి రావాలి? వారి ద్వారా ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఎలా అబద్ధపు ప్రచారాలు చేసుకోవాలి.. ఇదే చంద్రబాబు రాజకీయ విధానం.
  • రాష్ట్రంలో ఏదో ఒక అశాంతిని సృష్టించి.. అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. ఎన్టీఆర్‌ బతికున్నప్పటి నుంచి కూడా చంద్రబాబు ఆలోచన ఇదే. కుటుంబాలను విడదీసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న నీచ సంస్కృతి చంద్రబాబుది.
  • అమరావతి రైతుల పేరుతో పాదయాత్రలు చేయించి రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలన్నది చంద్రబాబు కుట్ర. పరిపాలనా రాజధానిగా విశాఖను చేయాలన్నదే మా ప్రభుత్వ నిర్ణయం.
  • పాదయాత్రలో.. ఎక్కడైనా ఏదైనా జరగకూడని ఘటనలు జరిగితే.. దానికి బాధ్యత చంద్రబాబే వహించాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్