Tuesday, February 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసీతా రామం సినిమా సమీక్ష

సీతా రామం సినిమా సమీక్ష

Muslim Phobic:
ముస్లిమ్ ఫోబిక్
ప్లాస్టిక్
కేరికేచరిస్టిక్..
సినిమా ఎలా వుందని ఒక ఫ్రెండడిగితే ఈ మూడు మాటల్లోనే చెప్పాను.
అందరూ బావుందన్నాక మనం బాలేదంటే ఎలా?
అందరూ బావుందనడానికి కూడా ఏవో కారణాలుండే వుంటాయి కదా.
లాజిక్కులు పక్కనపెడితే కథ construction బావుంది.
కథలో వేసిన ముడులు,
అవి విప్పిన తీరు,
తిరిగిన మలుపులు,
చివరగా క్లయిమాక్స్ చేరిన తీరు..
అన్నీ పక్కా స్క్రిప్టింగ్ రూల్ ప్రకారం జరిగిపోతాయి.
ఇవి కాక మంచి పాటలున్నాయి.
విజువల్ గా సినిమా అందంగా వుంది.
పిచ్చి కామెడీలు, ఫైట్లు , సెట్లు సెటైర్లు లేవు..
జనం మూడ్ కి తగ్గట్టు వుంది సినిమా.
అయితే, ఈ అందం మాటున ఒక ఎజెండా వుంది.
అదే ముస్లిమ్ ఫోబిక్ ఎజెండా.
ఇప్పటి రాజకీయాలకు సరిపడా ఎజెండా.


ముస్లిమ్ ఫోబిక్..
మొత్తం కాశ్మీర్ ని అగర్తా అనే ఒక హిందు గ్రామం కోణం లో చూపించడం దగ్గర నుంచి మొదలువుతుంది.
ముస్లిమ్ లంతా అయితే, టెర్రరిస్టులు, లేదా “తమ”లోని టెర్రిస్టులను గుర్తించలేని అమాయకులు.
కేవలం సైన్యం వల్లే కాశ్మీర్ లో హిందు ముస్లిమ్ లు కలిసిబతుకున్నారని మరో జ్ఞాన గుళిక.
అక్కడక్కడా మంచి ముస్లిమ్ లు కూడా వుంటారు. వాళ్ళు సైన్యానికి తిండిగింజలు సరఫరా చేసి మంచి తనం
నిరూపించుకుంటారు.
“బొట్టు లేకుండా కూడా అమ్మాయిలు అందంగా వుంటార”ని హీరో ఆశ్చర్యపోతాడు.
అసలు నూర్జహాన సీతగా మారడమెందుకు?
నూర్జహాన్ అయితే,రామ్ ప్రేమించడా?
ప్రేమకోసం మతం మారడం కొత్త కాదు.. జరగకూడదని కాదు. కానీ, ఈ సీతకథ వేరు.
హను రాఘవపూడి మీద మణిరత్నం ప్రభావం అందాల రాక్షసి నుంచి కనిపస్తుంది.
ఇందులో కూడా రోజా, బొంబాయి ప్రభావాలుండి వుండొచ్చు.
బొంబాయి సినిమా కూడా పైకి హిందు ముస్లిమ్ ప్రేమ వ్యవహారం లా కనిపిస్తుంది.
కానీ ఆ ముసుగులో మొత్తం బొంబాయి అల్లర్లను ఒక హిందు కోణంలో చూపిస్తాడు.
ప్రేమ కథ కూడా ఈవెన్ గా వుండదు.
హీరో అప్పర్ కేస్ట్, ప్రోగ్రెసివ్
హీరోయిన్ మాత్రం అతికష్టం మీద “బుర్కా” వదలించుకుని వస్తుంది.
సరిగ్గా ఇక్కడ నూర్జహాన్ సీతగా మారినట్టే..
ఒక వేళ హీరో సలీమ్ అయిండి, సీత నూర్జహాన్ గా మారి సలీమ్ ని వెతుక్కుంటూ వస్తే..
ఈ పాటికి బాయ్ కాట్ సలీమ్ నూర్జహాన్ ట్రెండ్ అయివుండేదేమో..


ప్లాస్టిక్..
ఈ సినిమాకి ప్రాణం హీరోయిన్ అయితే, ఆమె ముఖంలో మాత్రం జీవమే కనిపించలేదు.
తెరమీద కనిపించిన మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్ (దాన్ని ఎక్స్ ప్రెషనే అంటామా?)
నవ్వినా, నవ్వకపోయినా ముఖంలో పెద్ద తేడా కనిపించలేదు.
గ్లిజరిన్ ప్రాయోజిత కన్నీళ్లు లేకపోతే ఏడుస్తుందని కూడా అర్థం కాదు.


కేరికేచరిస్టిక్..
అసలు సినిమాలో ఏ పాత్ర చూసినా మూసపోసిన మంచితనం తప్ప మరే జీవలక్షణమూ లేదు.
హీరోయిన్ కి అయితే, హీరో కోసం తపించడం తప్ప వేరే పనే లేదు.
వీళ్ళందరిలోకీ పాపం భావాలు పలకకపోయినా, ఆ సుమంత్ కేరెక్టరైజేషన్ లోనే కాస్త ఎత్తుపల్లాలున్నాయి.

ఈ సినిమా చూసాక కాస్త అన్ వైండ్ కావడానికి మలయాళంలో వచ్చిన సుందరి గార్డెన్స్ చూసాను. ఎంత బావుందో.. కేరెక్టరైజేషన్, గ్రాఫ్, ఎక్స్ ప్రెషన్, ఇవన్నీ వుంటే సినిమా ఎలా వుంటుందో తెలియాలంటే ఆ సినిమా చూడాల్సిందే రిఫ్రెషింగ్.. లైవ్ లీ.. సుందరీ గార్డెన్స్..

-శివ

RELATED ARTICLES

Most Popular

న్యూస్